అనుకున్నవేవీ జరగడం లేదా? అయితే ఈ పూజ చెయ్యండి ఇక అంతా శుభమే!

Pray to Taruna Ganapathi for your good things

11:19 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Pray to Taruna Ganapathi for your good things

కొందరు ఏ పని చేపట్టినా ఈజీగా అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ కొందరికి ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారంగా తరుణ గణపతిని పూజించమని అంటారు.

1/4 Pages

వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. అందుకే తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. ఈ రూపంలో స్వామికి ఎనిమిది చేతులు ఉంటాయి. కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొకచేత జామపండుని, ఒక చేత చెరుకు గడలని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఒకచేత మోదకాన్ని, ఒకచేత వెలగ పండునీ, ఒకచేత లేత మొక్కజొన్న కంకుల పొత్తినీ, మరొక చేత వలనీ ధరించి ఉంటాడు. తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది.

English summary

Pray to Taruna Ganapathi for your good things