అబ్బాయికి గర్భ సంచి..

Pregnancy bag for boy in Karimnagar

10:10 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Pregnancy bag for boy in Karimnagar

అప్పుడప్పుడు వింతలూ, అరుదైన ఘటనలూ జరగడం పరిపాటి. అమ్మాయిలకు గర్భసంచి వుండడం సృష్టి ధర్మం కానీ ఇందుకు భిన్నంగా ఓ అబ్బాయి కడుపులో గర్భసంచి డెవెలప్ అయిందట. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపెల్లి గ్రామానికి చెందిన కుర్ర శేఖర్, భారతిల కుమారుడు వేణు(13)లో చిన్నప్పటి నుంచి ఆడపిల్లల లక్షణాలు కనిపిస్తున్నాయంటూ అతడిని పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పారట. విషయం తేలలేదు. దీంతో అతడి తల్లిదండ్రులు ఇటీవల ముస్తాబాదులోని పీపుల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్ల గా, అక్కడ అతడికి వైద్య పరీక్షలు జరిపిన వైద్యుడు శంకర్, బాలుడి కడుపులో గర్భసంచి వున్నట్లు గుర్తించారు.

హిమోప్రోడిజం అనే వ్యాధి వల్ల వేణులో ఆడ, మగ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయని శంకర్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత వేణుకు ఆపరేషన్ చేసి అతడి కడుపులోని గర్భసంచిని తొలగించారు. లేకుంటే, పెద్దయ్యాక గర్భం దాలిస్తే, అదో వింత అయ్యేది... సరైన సమయంలో గుర్తించి పెద్ద ఉపద్రవం నుంచి తప్పించారు.

English summary

Pregnancy bag for boy in Karimnagar, Yellareddy Peta- Veernapelli.