వామ్మో, గర్భిణులు యోగా చేశారు.. వరల్డ్ రికార్డు సాధించారు

Pregnancy women did yoga

05:49 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Pregnancy women did yoga

ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపాదించిందే తడవుగా యోగాకు ముద్ర పడడంతో గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం మొదలైంది. ఇప్పుడు రెండవ సంవత్సరం యోగా డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఎందరో యోగాలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మొదలు, సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, వాకర్స్, విద్యార్థులు అందరూ కూడా యోగా చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, యోగా డే సందర్భంగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో సుమారు 2వేల మంది గర్భిణులు యోగాసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. వీరంతా నిపుణుల పర్యవేక్షణలో యోగా చేశారు. అలాగే మరో 8వేల మంది చిన్నారులు మావనహారంలా ఏర్పడి మరో రికార్డు సృష్టించారని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ వెల్లడించారు. కాగా రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు 1.25 కోట్ల మంది యోగా చేసినట్లు అంచనా. గుజరాత్ లో పలు కార్యక్రమాల్లో 40వేల మంది యోగా చేశారు. ఈరోజు ఉదయం ఆనందిబెన్ పటేల్ కూడా 40 నిమిషాల పాటు యోగా చేశారు. ఆమెతో పాటు యోగా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, భాజపా నేతలు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు యోగా చేశారు.

English summary

Pregnancy women did yoga