ప్రీతీ జింతా  అంత కోపమా?    

Preity Zinta About The Rumours On Her Marriage

09:27 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Preity Zinta About The Rumours On Her Marriage

బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింతా కు కోపం వచ్చింది. మరో వారంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల తో ఆమె చిరాకు పడుతోంది. తానిప్పుడే పెళ్లి చేసుకోవట్లేదని ఆమె తెగేసి చెప్పేస్తోంది. ‘నా పెళ్లి తేదీని నేనే ప్రకటిస్తాను. అప్పటిదాకా నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి ప్లీజ్‌. నా వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి పుకార్లను ఇకనైనా ఆపండి’ అంటూ ప్రీతి ట్వీట్‌ చేసింది. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ జీన్‌ గుడ్‌ఇనో ప్రీతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు దీంతో

ప్రీతీజింతా ఈ నెలలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించింది. అయితే గతంలోనూ ప్రీతి పెళ్లి చేసుకోవడం గురించి వార్తలు వస్తే, వాటిని ఖండించినా , తాజాగా మరోసారి అవే పుకార్లు రావడంతో చిర్రెత్తు కొచ్చింది. అందుకే నా పెళ్లి నా ఇష్టం అంటూ కాస్త గట్టిగా స్పందించింది.

English summary

Recently a news came on that Bollywood heroine preity Zinta was going to married.Preity took to Twitter to inform her fans she has no marriage plans as of now, and will tell them as and when it happens.