అతన్ని సీక్రెట్‌గా పెళ్ళి చేసుకున్న ప్రీతి

Preity Zinta Married Her Boyfriend In Los Angeles

12:48 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Preity Zinta Married Her Boyfriend In Los Angeles

బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా గత కొంతకాలం క్రిందట పెళ్ళి చేసుకుందని మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ విషయం పై ప్రీతిజింటా స్పందిచి మీడియా పై విరుచుకు పడింది కూడా. నాకు పెళ్లైతే నేనే చెప్తా మీరు కంగారు పడకండి అని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చింది. అయితే మళ్లీ తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ప్రీతిజింటా తన అమెరికా బాయ్‌ ఫ్రెండ్‌ అయిన జీని గెడెనఫ్‌ ను పెళ్ళి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో లాస్‌ ఏంజిల్స్‌లో తన స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం గ్రాండ్‌గా జరిగిందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ వార్తలు నిజం అనుకోవడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ప్రీతిజింటాకి బాగా క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన సుజానే ఖాన్‌ (హృతిక్‌ భార్య) మరియు సురీల్‌ గోయెల్‌ కూడా ప్రస్తుతం లాస్‌ ఏంజిల్స్‌లో ఉండడమే దీనికి కారణం. ప్రీతిజింటా పెళ్ళికి హాజరు కావడానికి వారు అక్కడకి వెళ్లారని చెప్తున్నారు. అయితే తన బాయ్‌ ఫ్రెండ్‌ని సీక్రెట్‌గా పెళ్ళి చేసుకున్న ప్రీతి తన రిసెప్షన్‌ని మాత్రం బాలీవుడ్‌ ప్రముఖుల మధ్య చాలా గ్రాండ్‌గా జరుపుకోబోతుందని సమాచారం. ప్రీతిజింటా నెల రోజులు పాటు అమెరికాలోనే హనీమూన్‌ ఎంజాయ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేసుకుందట. ప్రీతిజింటా ప్రస్తుతం ఐపీఎల్‌ పంజాబ్‌ టీమ్‌కి సహయజమానిగా వ్యవహరిస్తుంది.

ప్రీతి జింటా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. 

1/6 Pages

బాయ్ ఫ్రెండ్:

తన బాయ్ ఫ్రెండ్ జీనీ గుడ్ఎనఫ్ తో ప్రీతి జింటా.  

English summary

Bollywood Heroine Preity Zinta maried her Amarican Boy Friend in Los Angeles on 29 th February.This marriage was done secretly with the closest friends of Preity Zinta and Family members.Now this news was going viral in internet and yet now Preity Zinta not responded the news on Her Marriage.