సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సన్నీతో రొమాన్స్ ..

Preity Zinta To Romance With Sunny Deol

09:41 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Preity Zinta To Romance With Sunny Deol

ఒకానొక సమయంలో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ప్రీతీ జింటా... నాలుగు పదుల వయసులో ఓ ఇంటిదైన ఈ ముదురు భామ... సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ తన ఛార్మింగ్ స్మైల్‌తో సిల్వర్ స్క్రీన్ పై తళుక్కున మెరవడానికి సిద్ధమైంది . హీరోయిన్‌గా ఛార్మ్ కోల్పోయి చాలా కాలమే అయినా... 2013లో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన 'ఇష్క్ ఇన్ ప్యారిస్' అనే చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించింది అమ్మడు. ఆ తరువాత 'హ్యాపీ ఎండింగ్' అనే చిత్రంలో కేమియో మినహా... అమ్మడు మళ్లీ అడ్రెస్ లేదు. ఇక ఇటీవలే తన లాంగ్ టైమ్ ఫ్రెండ్ జీన్ గుడ్ ఇనఫ్‌తో మూడు ముళ్లు వేయించుకున్న డేర్ డెవిల్ లాంటి ఈ చిన్నది... ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైన ఈ సొట్ట బుగ్గల సుందరి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ, మరోసారి సన్నీడియోల్‌తో రొమాన్స్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చూడండి : గిన్నీస్ బుక్ లో సుశీల

గతంలో వీరిద్దరూ 'ది హీరో', 'హీరోస్' అనే చిత్రంలో కలసి నటించారు. చాలాకాలంగా న్యూయార్క్ లోనే ఉంటోన్న ప్రీతీ పెళ్లయ్యాక ఇక అక్కడే సెటిల్ అయిపోతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ పెళ్లి పారాణి ఆరకముందే.. అమ్మడు మళ్లీ ముఖానికి రంగేసుకుంటోంది. సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న 'భయ్యాజీ సూపర్ హిట్' అనే యాక్షన్ కామెడీ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించబోతోంది.ఇక ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అర్షద్ వార్శీ, అమీషా పటేల్, మీరా చోప్రా కీలక పాత్రలు పోషించబోతున్నారు.ప్రీతీ మళ్లీ తెరపై అలరించేందుకు సిద్ధమవ్వడంతో అమ్మడి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారట.

ఇది కూడా చూడండి : ఆస్కార్‌ గ్రహీత ప్యాటీ డ్యూక్‌ ఇకలేదు

English summary

Heroine Priety Zinta to romance with senior hero Sunny Deol in "Bhayya Ji Superhit" movie.This movie was an action comedy entertainer.This is the first film of Priety Zinta after marriage.