సోగ్గాడే చిన్నినాయినా రీమేక్ లో నటించనున్న వెంకీ హీరోయిన్

Prema To Act In Soggade Chinni Nayana Remake

12:22 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Prema To Act In Soggade Chinni Nayana Remake

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడు, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయినా సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసి ఇటు మాస్ ప్రేక్షకులని అటు క్లాస్ ప్రేక్షకులని అలరించి బాక్సాఫీసు గొప్ప విజయం సాధించాడు.

ఒక చోట సూపర్ హిట్ అయిన చిత్రాలను వేరే చోట రీమేక్ చెయ్యడం మామూలు విషయమే. ఇటీవల ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సోగ్గాడే చిన్ని నాయినా చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేయ్యనున్నారట. కన్నడ రీమేక్ లో నాగార్జున పాత్రను కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర పోషించానుండగా, రమ్య కృష్ణ పాత్రలో మాజీ హీరోయిన్ ప్రేమ నటించనుందని సమాచారం.

కన్నడ నటి అయిన ప్రేమ పెళ్లి చేసుకున్న తరువాత మల్లి సినిమాల వైపు చూడలేదు, కానీ ఇప్పుడు తన భర్త జీవన్ అప్పచ్చు ఓ విడాకులు తీసుకుని తన వివాహ బంధాన్ని తెచ్నుకున్న తరువాత మళ్ళి సినిమాల వైపు దృష్టి సారించిందని సమాచారం . విక్టరీ వెంకటేష్ సినిమాతో తెలుగు లో పరిచయమైన ప్రేమను, వెంకటేష్ హీరోయిన్ గా పిలుస్తుంటారు. ప్రేమ తెలుగులో దేవి, ధర్మ చక్రం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. మళ్ళి సినిమాల వైపు దృష్టి సారించిన ప్రేమ సెకండ్ ఇన్నింగ్స్ లో కుడా మునుపటి లాగానే సక్సెస్ కావాలని కోరుకుందాం. అల్ ది బెస్ట్ ప్రేమ.....

ఇవి కూడా చదవండి:బట్టలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరో(వీడియో)

ఇవి కూడా చదవండి:పోలీస్ స్టేషన్ లోనే బట్టలు విప్పేసింది.. ఎందుకో తెలుసా?(వీడియో)

ఇవి కూడా చదవండి:రోజంతా ఎండలో ఉంచాడని ఓనర్ తల కొరికి చంపేసిన ఒంటె

English summary

Akkineni Nagarjuna's Soggade Chinni Nayana Movie was one of the biggest hit in Nagarjuna;s career and now this movie was going to be remake in Kannada with Kannada Star Hero Upendra and Veteran Actress Prema to act in Ramya Krishnan role in the movie.