రికార్డులు తిరగరాసిన సినిమాకు చేదు అనుభవం

Premam Movie Doesnot Get Award

12:30 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Premam Movie Doesnot Get Award

ఒక సినిమా హిట్ అయితే చాలు ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు . ఆ సినిమాలోని సన్నీవేశాలను గుర్తుకు తెచ్చుకుంటూ బాగా తీసారు , సినీమా భలే ఉంది అని ఆ సినిమా గురించి ఒకటే మాటలు. ఇక అలాంటి సినిమాలకు వచ్చే అవార్డులు గురించి వేరే చెప్పనవసరం లేదు. కానీ తాజాగా అందరిని ఆకట్టుకుని , అందరి చేత శభాష్ అనిపించుకున్న ఒక సినిమాకు ఆ రాష్ట్ర అవార్డు వేడుకలలో చేదు అనుభవం ఎదురైంది.

వివరాలోకి వెళ్తే మలయాళం సినీ పరిశ్రమలో ఉన్న పాత రికార్డులన్నీ తిరగ రాసి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది "ప్రేమమ్" చిత్రం . దాదాపు ఆరు నెలల పాటు హౌస్ ఫుల్ షోలతో ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన స్పందన అనుకుంది ప్రేమమ్ చిత్రం . అయితే కేరళ రాష్ట్రం నుండి "ప్రేమమ్ " సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డు కుడా రాకపోవడం రాలేదు. ఈ సినిమాకే కాకుండా ప్రేమమ్ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన నివిన్ పౌలీ కు కుడా ఏ కాటగిరిలో ఒక్కటంటే ఒక్క అవార్డు కుడా రాలేదు.

దీంతో అవార్డు కమిటీ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో అవార్డుల జ్యూరీ చైర్మన్ మోహన్ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసాడు . అయన మాట్లాడుతూ ఏ సినిమా అయినా అవార్డు దక్కించుకోవాలంటే దానికి అంటూ తగిన ప్రమాణాలుంటాయని , అలంటి ప్రమాణాలు ప్రేమమ్ చిత్రంలో లేవని , ప్రేమం చిత్రం మేకింగ్ చాలా లేజీ ఫిలిం మేకింగ్ అని అయన అన్నారు. ఇలా స్వయంగా అవార్డుల జ్యూరీ చైర్మన్ నే ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో విమర్శలు మరీ ఎక్కువయ్యాయి.

ప్రేమమ్ లాంటి సినిమా ఎప్పటికో ఒకటి వస్తుందని అలాంటి అద్భుతమైన సినిమాను ప్రోత్సహించకపోవడం బాధాకరమని కొందరు పెదవి విరుస్తున్నారు. ప్రేమమ్ చిత్రం పై మొదటి నుండి అనేక మంది కుట్ర పన్నారు . డివిడి ప్రింట్‌ లీక్‌ దగ్గర్నుంచి, థియేటర్ల మూసివేత వరకు చాలా రకాలుగా ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరగాయి కాని వాటన్నింటిని అధిగమించి ప్రేమమ్ సంచాలన విజయం సొంతం చేసుకుంది.

English summary

Malayalam All time biggest hit Premam Movie does not get even a single award in Kerala State Awards.This movie created new records in Malayalam film industry.Hero Nivin Paul also did not get any award and this was opposed by soo many people but Award Jury Chairman says that Premam movie won't deserve award.He also says that they had some rules and regulations to give award to movie.