'ప్రేమమ్‌' రిలీజ్‌ ముందే కోట్లు కురిపిస్తుంది

Premam Movie Rights Sold For Huge Price

03:39 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Premam Movie Rights Sold For Huge Price

యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య 'దోచేయ్‌' చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమమ్‌'. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన 'ప్రేమమ్‌' చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రానికి 'కార్తికేయ' ఫేమ్‌ చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా నాగ చైతన్య సరసన శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోన్నా సెబాష్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్‌ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ కి విపరీతమైన స్పందన రావడంతో ఈ ఊపులోనే ఈ చిత్ర నిర్మాత శాటిలైట్‌ రైట్స్‌ను 22 కోట్లు కు అమ్మేశాడట. ఈ చిత్రానికి మొత్తం 16 నుండి 17 కోట్లు మాత్రమే ఖర్చయితే ఈ చిత్రం రిలీజ్‌ కాకముందే 5 కోట్లు లాభం రావడంతో ఈ చిత్ర నిర్మాత యస్‌. రాధాకృష్ణ, నాగచైతన్య ఫుల్‌ హ్యాపీగా ఉన్నారట. అయితే కృష్ణా జిల్లా పంపిణీ హక్కులని మాత్రం నిర్మాత తన దగ్గరే ఉంచేసుకున్నాడట.

English summary

Naga Chaitanya's upcoming film Premam was the remake of Premama movie in Malayalam.Sruthi Hassan, Anupama Parameswaran were acting as heroines in this movie and this movie first look has got good response.This movie rights were sold for huge price.