నాగ చైతన్యతో సంతోషంగా గడుపుతున్న శృతి

Premam Movie Team In Norway

11:45 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Premam Movie Team In Norway

అసలే సమంత తో ప్రేమాయణంలో వున్న నాగచైతన్య ఇప్పుడు శృతిహసన్ తో సందడి చేస్తున్నాడు. సమంత తో లవ్ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో మళ్లీ ఈ గొడవ ఏంటి అనుకుంటున్నారా? అయితే రియల్ లైఫ్ కి సంబంధించింది కాదు. రీల్ లైఫ్ లోని ఘట్టం కోసం చైతూ , శృతి ఫారిన్ వెళ్లారు. వీరిద్దరూ కీలక రోల్స్ లో నటిస్తున్న ‘ప్రేమమ్’ మూవీ యూనిట్ ప్రస్తుతం నార్వేలో సందడి చేస్తోంది. పూర్తి రొమాంటిక్, కామెడీ సినిమా అయిన ఈ చిత్రం మలయాళ మూవీ రీ-మేక్ అన్న సంగతి తెలిసిందే. శృతి తన ట్విటర్ ఖాతా ద్వారా తాజా ఫోటోలను శృతి ట్వీట్ చేసింది. చైతూ, దర్శకుడు చందు మెండేటితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. నార్వేలో ఈ సినిమా హీరో అలాగే యూనిట్ తో సంతోషంగా గడుపుతున్నానని పేర్కొంది.

కాగా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే నెల 12న ప్రేమమ్ విడుదల కావచ్చునని ప్రచారం జరుగుతున్నా.. పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా ఆ తేదీకి విడుదల కావడం కష్టమేనని, సెప్టెంబరు 9న విడుదలయ్యే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.

ఇది కూడా చూడండి: ఈ హోటల్ రూల్స్ వేరయా..

ఇది కూడా చూడండి: రూ. 10 టికెట్ తో సినిమా చూపిస్తోన్న అమ్మ

ఇది కూడా చూడండి: రెండు గంటల్లోనే నో టికెట్ బోర్డ్స్.....

Such a lovely time in Norway with team premam @karthik.gattamneni @chandoo_mondeti ????????

A photo posted by @shrutzhaasan on

English summary

Premam Movie Team In Norway.