ఈ సారైనా హిట్‌ కొట్టేనా?

Premante Suluvu Kadura audio on december 6th

06:02 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Premante Suluvu Kadura audio on december 6th

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా నటించిన మొదటి చిత్రం 'నోట్‌బుక్‌'. ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాఫ్‌ అవ్వడంతో మళ్లీ మరో సినమాలో నటించలేదు రాజీవ్‌. చాలా గ్యాప్‌ తరువాత రాజీవ్‌ సాలూరి హీరోగా నటిస్తున్న చిత్రం 'ప్రేమంటే సులువు కాదురా'. ఈ సినిమాలో రాజీవ్‌ సరసన స్మితా దాస్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు గోవింద్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని డిసెంబర్‌ 6న ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌లో అంగరంగ వైభవంగా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం నందన్‌ రాజ్‌ సమకూర్చగా, 'ప్రాణం' ఫేమ్‌ కమలాకర్‌ నేపధ్య సంగీతం అందిస్తున్నారు. ఆర్‌. ఫై క్రియేషన్స్‌ పతాకం పై భవనాసి రాంప్రసాద్‌ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి చిత్రం 'నోట్‌బుక్‌' అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ చిత్రమైన హిట్‌ కొట్టాలని రాజీవ్‌ ఆశిస్తున్నాడు.

English summary

Premante Suluvu Kadura audio on december 6th. Music director koti's son Rajeev Saluri is acting as a hero in this movie. Smitha Das romancing with Rajeev.