మరో 'ప్రేమికుడు' ఆడియో

Premikudu Audio Launched

11:22 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Premikudu Audio Launched

గతంలో ఫభుదేవా హీరోగా వచ్చిన ప్రేమికుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మళ్ళీ అదే పేరిట శ్రేయాస్‌ మీడియా బ్యానర్‌పై చిత్రం వస్తోంది. నూతన నటీనటులు మానస్‌, సనమ్‌శెట్టి జంటగా తెరకెక్కుతున్న ప్రేమికుడు చిత్రం ఆడియో విడుదల  హైదరాబాద్‌లోని రాక్‌క్యాజిల్స్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. కళా సందీప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ఎన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి, నటి కవిత, బుల్లితెర నటి అనితా చౌదరి , చిత్రబృందం పాల్గొన్నారు. విజయ్‌ బాలాజీ స్వరాలు సమకూర్చాడు.

ప్రేమికుడు చిత్రం గురించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో..

1/7 Pages

ఆడియో


సినీ ప్రముఖుల చేతుల మీదుగా, హై టెక్ సిటీ లోని రాక్ హైట్స్ లో ఈ చిత్ర ఆడియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

English summary

New actors Manas,Sanam Shetty acted as hero heroines in the film called Premikudu .This movie audio was released by Director V.V.Viinayak in hyderabad.