ఒక్క పైసాకే 10లక్షల భీమా.. రైల్వే బంపరాఫర్!

Premium is only for 10 paisa

03:25 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Premium is only for 10 paisa

పండగ కానుకగా వివిధ కంపెనీలు, మొబైల్ సంస్థలు ఆఫర్ ల మీద ఆఫర్లు ఇస్తుంటే, రైల్వే శాఖ కూడా బంపర్ ఆఫర్ ఇస్తోంది. ప్రయాణికులకు రైల్వే దీపావళి బొనంజా ప్రకటించింది. 92 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల వరకు ప్రయాణ భీమా సదుపాయం కల్పిస్తున్న రైల్వే శాఖ.. శుక్రవారం నుంచి కేవలం ఒక్క పైసాకే ఆ భీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఈనెల 31వరకు బుక్ చేసుకున్న అన్ని రకాల టికెట్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మరింత మంది ప్రయాణికులు ఈ సదుపాయం వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఈ ఆఫర్ ఇచ్చినట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) సీఎండీ ఎ.కె.మనోచా వెల్లడించారు.

ప్రారంభించిన కేవలం నెల రోజుల్లోనే కోటికి పైగా ప్రయాణికులు వినియోగించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. కేవలం 92పైసలకే బీమా సదుపాయం కల్పిస్తున్న రైల్వే శాఖ.. ప్రమాదంలో మరణించినా లేక శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.10లక్షలు, పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.7.5లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వస్తే ఖర్చుల కింద రూ.2లక్షల వరకు భీమా చెల్లిస్తారు. ఇక చనిపోయిన వారిని తరలించేందుకు రూ.10వేలు చెల్లిస్తారు. అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడి, దోపిడి, కలహాలు, కాల్పులు, పేలుళ్లు.. ఇలా ఆ ప్రయాణంలో ఎలాంటి ఘటన జరిగినా కూడా భీమా పరిహారం ఇస్తారు.

English summary

Premium is only for 10 paisa