అగ్రి వ్యవహారంపై రాష్ట్రపతి సీరియస్

President Of India Fires On Agri Gold Issue

11:38 AM ON 28th April, 2016 By Mirchi Vilas

President Of India Fires On Agri Gold Issue

అగ్రిగోల్డ్‌ వ్యవహారం భారత రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి సైతం ఆగ్రహాన్ని కల్గించింది. తరచూ అగ్రిగోల్డ్ తీరుపైనా, సిఐడి విచారణ తీరు మీదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎపి ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు పలు సందర్భాల్లో నిలదీసింది.

ఇవి కూడా చదవండి:లోకేష్ నోట మీడియా ఛానెల్ మాట

తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకూ ఈ కేసులో ఏఏ చర్యలు తీసుకున్నారో పిటిషనర్‌కు నేరుగా తెలియజేయాలని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలకు దిగుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:రాయలసీమకు చిత్ర పరిశ్రమ

ఇవి కూడా చదవండి:విమానం టాయ్‌లెట్‌లో 7కేజీల బంగారం!!

English summary

President of India made some comments on the Agri Gold issue on Andhra Pradesh. President office wrote letter to Andhra Pradesh Government by ordering that to give full details about this news.