శీతాకాల విడిది ముగిసింది .. వీడుకోలూ ...

President Pranab Bye To Hyderabad

12:19 PM ON 31st December, 2015 By Mirchi Vilas

President Pranab Bye To Hyderabad

భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది గురువారంతో ముగిసింది. ప్రతియేటా శీతాకాలంలో భాగ్యనగరానికి వచ్చి బస చేయడం రివాజు. అందులో భాగంగా ఈ ఏడాది బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల విడిది చేసారు. ఇక్కడ విడిది చేసిన సందర్భంగా పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా అయి భీమవరంలో టిటిడి నిర్మించిన వేద పాఠశాల భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని దర్శించారు. తెలంగాణ సిఎమ్ కెసిఆర్ నిర్వహించిన అయుత చండీయాగం చివరిరోజు కార్యక్రమానికి కూడా వెళ్ళినప్పటికీ అక్కడ యాగశాలలో సడన్ గా అగ్నిప్రమాదం ఏర్పడడంతో యాగశాల కు వెళ్ళకుండానే వెనుదిరిగారు.

తెలంగాణ సిఎమ్ కెసిఆర్ , ఎపి సిఎమ్ చంద్రబాబు , వైసిపి నేత జగన్ , ఇంకా పలువురు రాష్ట్రపతిని కల్సుకున్నారు. ఇక శీతాకాల వడిది ముగుస్తున్న సందర్భంగా గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల సిఎమ్ లిద్దరూ కూడా విందుకు హాజరయ్యారు.

హైదరాబాద్ బస ముగిసి తెరిగి డిల్లీకి వెడుతున్న ప్రణబ్‌ముఖర్జీ గురువారం ఉదయం విమానాశ్రయంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు రాష్ట్రమంత్రులు మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

English summary