అమ్మో, 'బాహుబలి 2' నైజాం హక్కులు ఎంతో తెలుసా?

Price of Baahubali 2 nizam rights

12:36 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Price of Baahubali 2 nizam rights

ఇప్పుడు అందరి చూపు 'బాహుబలి -2' పైనే. దీనికి ఆ సినిమాలో సస్పెన్స్ కి సమాధానం దొరకాల్సి వుంది. ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించిన బాహుబలి చిత్రానికి రెండో భాగంగా రూపొందుతున్న బాహుబలి 2 ఎప్పుడు రిలీజవుతుందా అని కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు. తెలంగాణ(నైజాం) హక్కులను ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు సొంతం చేసుకున్నారు. ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు రూ. 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. భారీ మొత్తానికి హక్కులను సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. గతంలో మా సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలంగాణలో పంపిణీ చేశాం. తాజాగా బాహుబలి చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా పోటీ మధ్య బాహుబలి 2 హక్కులను పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నాం. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను పొందిన విషయం తెలిసిందే. దాంతో బాహుబలి 2 భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.

English summary

Price of Baahubali 2 nizam rights