‘ప్రైడ్‌ ఆఫ్‌ కేరళ’ గా విద్యాబాలన్‌

Pride Of Kerala Award To Vidya Balan

10:35 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Pride Of Kerala Award To Vidya Balan

కేరళలో పుట్టి హిందీ పరిశ్రమలో ద డర్టీ పిక్చర్‌, నో వన్‌ కిల్డ్‌ జెసికా పరిణీత, తదితర చిత్రాలతో నటి విద్యాబాలన్‌, జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. సినీ పరిశ్రమలో తనదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు సాధిందిన ఈమెకు కేరళకు చెందిన వరల్డ్‌ మళయాళీ కౌన్సిల్‌ సంస్థ, కైరళి టెలివిజన్‌లు సంయుక్తంగా ప్రైడ్‌ ఆఫ్‌ కేరళ అవార్డును అందజేశాయి. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా విద్య తెల్పింది. తన సొంత రాష్ట్రంలో అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేసిన విద్యాబాలన్‌ ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖిలతో కలిసి తీన్‌ చిత్రంలో నటిస్తోంది.

English summary

Bollywood Most Talented Heroine Vidya Balan Receives "Pride Of Kerala" Award by world Malayali Council.This was posted by Vidya Balan in her twitter and says that she was very happy for receiving that award from her own state.Presently She Was acting in Teen movie