జుట్టు కత్తిరించుకునేందుకు ప్రధాని చేసే ఖర్చు లక్ష!

Prime minister hair cut money was 1 lakh

11:21 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Prime minister hair cut money was 1 lakh

వెనుకటికి ఓ రాజు జిజియా పన్ను(జుట్టుపై) వేసినట్లు విన్నాం. కానీ జుట్టు కత్తిరించుకోనేందుకు ఓ దేశ ప్రధాని బోల్డంత ఖర్చు చేసేస్తున్నాడట. ఆ ఖర్చు పెట్టిన వ్యయం పై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయిల్ లో సచార్ బెన్ మీర్ అనే న్యాయవాధి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి వివరాలను సేకరించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఇటివల ఐక్య రాజ్యసమితి సమావేశాల కోసం అమెరికా వెళ్ళిన ఆయన హెయిర్ కటింగ్ కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టారట. దీని పై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు. అంతేకాకుండా భోజనానికి 1.25 లక్షలు, బట్టలు ఇస్త్రీకి 15 వేలు, ఫర్నీచర్ వాడకానికి 13 లక్షలు ఖర్చు చేశారని అంటున్నారు.

అయితే తాను ప్రశ్నించిన వెంటనే సమాధానం రాలేదని, జరూసలెం కోర్టు ఆదేశాల మేరకు ఈ వివరాలను తెలుసుకున్నానని సదరు న్యాయవాధి తెలిపారు. ప్రధాని ప్రజా ధనాన్ని దుర్వినియోగపరిచారని పలువురు ఇజ్రాయిల్ పౌరులు ప్రస్తుతం నిప్పులు చెరుగుతున్నారు.

English summary

Prime minister hair cut money was 1 lakh