జలపాతంలో మోడీ రూపం ... సోషల్ మీడియాలో హల్ చల్

Prime Minister Narendra Modi face in waterfall

03:21 PM ON 20th August, 2016 By Mirchi Vilas

Prime Minister Narendra Modi face in waterfall

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణ జన్ముడని, దేవ దూతని ఇలా రకరకాలుగా కేంద్ర మంత్రులు ఆకాశానికి ఎత్తేస్తుంటే, ఇప్పుడు ఏకంగా జలపాతంలో మోడీ రూపం కనిపిస్తోంది. ఇది మాయాజాలమో , యాదృచ్ఛికమో తెలియదు గానీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోందీ ఫోటో.

జలజల జాలువారుతున్న జలపాతంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిత్రం కనిపిస్తుందేమిటి అనుకుంటున్నారా? జలపాతంలో మోదీ రూపు రేఖలు కనిపిస్తున్నాయి. జాంబియా దేశంలోని విక్టోరియా జలపాతంలో ఈ చిత్రం ఆవిష్కృతమైందంటూ కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టారు. ఎత్తైన కొండగుట్టల పైనుంచి జాలువారుతున్న జలపాతంలో ఈ చిత్రం కనిపించడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు, పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ జలపాతాన్ని సందర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. పైనుంచి పడుతున్న జలం ఈ రూపాన్ని సంతరించుకోవడంపై ఆధ్యాత్మికత దాగి ఉంటుందని కూడా స్థానికులు చర్చించుకున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయితే, ఇది గ్రాఫిక్ మాయాజాలమని కూడా అనేస్తున్నారు. మొత్తానికి ఏదైనా ఈ పిక్ ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెంట్లు కూడా పడుతున్నాయి.

ఇది కూడా చూడండి: నందివర్ధనం పూలు కళ్ళపై పెట్టుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

ఇది కూడా చూడండి: సింధుకు ఆమె ఫాదర్ సిద్ధం చేస్తున్నవేంటో తెలిస్తే షాకవుతారు!

ఇది కూడా చూడండి: మన్మధుడు సీక్వెల్ లో అఖిల్?

English summary

Prime Minister Narendra Modi face in waterfall.