మోడీ ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది

Prime Minister was embarrassed to digest the Congress: Venkaiah

11:59 AM ON 20th November, 2015 By Mirchi Vilas

Prime Minister was embarrassed to digest the Congress: Venkaiah

మోడీ ప్రధాని కావడం జీర్ణించుకోలేకే కాంగ్రెస్ కి అసహనానికి గురవుతోందని, అందుకే కాంగ్రెస్‌ పార్టీ అసహనం పేరుతో విమర్శలు చేస్తోందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌ అసహనానికి గురవుతోందన్నారు. తమకు నచ్చని వాళ్లను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటని ఆయన విమర్శించారు . .

కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం కుల, మత శక్తులను ప్రోత్సహిస్తోందని వెంకయ్యనాయుడు ఆరోపించారు. అసహనం పేరిట కొంతమంది అవార్డులు తిరిగి ఇచ్చేయడం వారి వ్యక్తిగతమని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికల్లో విజయం రానంత మాత్రాన అంతా అయిపోయిందనుకుంటే ఎలాగని , ఇంకా చాలా ఎన్నికలు వున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినా బిహార్ ఎన్నికల్లో బిజెపికి ఓట్ల శాతం పెరిగిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఎపికి ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ లో చర్చ జరుగుతోందని వెంకయ్య చెబుతూ , నీతి ఆయోగ్ నుంచి నివేదిక రాగానే ప్రత్యేక హోదాపై మరింత వేగవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. పట్టణ పేదల ఇళ్ళ నిర్మాణానికి ఎపి ప్రభుత్వం ముందుగానే ప్రతిపాదనలు పంపడంతో ఒక లక్షా 90 వేల ఇళ్ళు కేంద్రం మంజూరు చేసిందని ఆయన చెప్పారు.

English summary

Prime Minister was embarrassed to digest the Congress: Venkaiah