గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ దొరికేసిన యువరాజు

Prince Harry Romance With His Girl Friend Meghan Markle

11:49 AM ON 17th December, 2016 By Mirchi Vilas

Prince Harry Romance With His Girl Friend Meghan Markle

ఇదేదో మామూలు ప్రేమికుల యవ్వారం కాదు. బ్రిటీషి యువరాజు వ్యవహారం. అయితేనేం ఇతని రొమాన్స్ గుట్టు రట్టు అయింది. లవ్ ఎపిసోడ్ ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్క్ లే చెట్టపట్టాలేసుకుంటూ తిరుగుతూ మొట్టమొదటిసారి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. లండన్ లోని వెస్ట్ ఎండ్ లో ఇటీవలే రొమాంటిక్ డేట్ చేస్తూ అందరి దృష్టిలో పడ్డారు. గీల్గుడ్ థియేటర్ లో ‘ది క్యూరియస్ ఇన్సిడెంట్ ఆఫ్ ది డాగ్’ను చూడటానికి వెళ్ళిన ఈ జంటను కెమెరాల్లో బంధించారు. యువరాజు మాట్లాడుతూ ఉంటే అందాల రాశి మేఘన్ (35) తల వంచుకుని నవ్వుతూ కనిపించారు. ఆమె ఆ క్షణాలను ఎంతో ఆస్వాదించినట్లు కనిపించింది.

అంతేకాదు, మేఘన్ ఈ వారమంతా హ్యారీతో కెన్సింగ్టన్ ప్యాలెస్ కాటేజ్ లోనే గడిపినట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో ఆమె తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది.. క్రిస్టమస్ సందర్భంగా క్వీన్స్ కౌంటీ ఎస్టేట్ లో జరిగే సంప్రదాయ సంబరాల్లో ఇతర సీనియర్ రాయల్స్ తో పాటు హ్యారీ పాల్గొంటారు. మిస్ మార్క్ లే ఈ సంబరాల్లో పాల్గొంటే అది మునుపెన్నడూ లేని విషయం అవుతుంది. ఎందుకంటే ఈ సంబరాల్లో కేవలం రాజకుటుంబంలోని సభ్యులు మాత్రమే పాల్గొంటారు.

ఇది కూడా చూడండి: ఈ ఐదూ ఉంటే ఆనందం మీవెంటే .. అవేమిటో తెలుసా?

ఇది కూడా చూడండి: ఆడవారి నోటిలో రహస్యాలు దాగవని ఎందుకంటారంటే?

ఇది కూడా చూడండి: ఉదయం నిద్రలేవగానే చూడవల్సిన, చూడకూడని వస్తువులు..

English summary

Prince Harry Romance With His Girl Friend Meghan Markle.