రూ. 2000పై ప్రింటింగ్ మిస్టేక్?!

Printing mistake on 2000 rupees note

12:03 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Printing mistake on 2000 rupees note

కేంద్ర ప్రభుత్వం సడన్ గా 500/- 1000/- నోట్ల రద్దు నేపధ్యమూ కొత్తగా మార్కెట్ లో రూ. 2000/- నోట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ నోట్ లో ప్రింటింగ్ మిస్టేక్ ఉందని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, నోట్ లో మిస్టేక్ ఉన్న ప్రాంతాన్ని రౌండప్ చేసి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టేసారు. దీంతో దీనిపై చర్చ మొదలైంది. ఇంతకీ ఆరోపిస్తున్న మిస్టేక్ గురించి ప్రస్తావిస్తే, ఏ నోట్ పై అయినా 15 భాషల్లో ఆ నోటు విలువను తెలిపేలా రాస్తారు. సేమ్ 2000/- నోట్ పై కూడా అలాగే రాశారు. కానీ ఈ నోట్ పై ఓ సారి 'దోన్ హజార్ రుపియా' అని, ఓ సారి 'దోన్ హాజార్ రుపయె' అని రాసి ఉంది.

1/4 Pages

వాస్తవానికి రెండు వేల రూపాయలను హిందీలో 'దో హజార్ రుపియే' అనాలి. అలా కాకుండా.. 'దోన్ హాజార్ రుపియే' అని తప్పుగా రాశారని, అది కూడా రెండు సార్లు రాశారని చాలా మంది చేసే ఆరోపణ. అయితే ఇదే ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా కొందరు నెటిజన్లు చేశారు. 'దోన్ హాజార్ రుపియా' అనేది ఒకటి కొంకణీ లాంగ్వేజ్ ది, మరో 'దోన్ హాజార్ రుపియే' అనేది మరాఠి లాంగ్వేజ్ ది, హిందీ జాతీయ భాష కాబట్టి దానిని సెపరేట్ గా దో హజార్ రుపియే అని రాశారు అని సమాధానం ఇస్తున్నారు.

English summary

Printing mistake on 2000 rupees note