ఫేస్‌బుక్‌లో ప్రైవేట్‌ గన్‌సేల్స్‌ బ్యాన్ 

Private Gun Sales Ban In Facebook

11:31 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Private Gun Sales Ban In Facebook

కారుచౌకగా ఫేస్ బుక్ ద్వారా చాలామంది యాడ్స్ చేసేసుకుంటున్నారు. ఇక గన్ డీలర్స్ కూడా ఫేస్ బుక్ ద్వారా గన్ విక్రయాలు చేసుకుంటూ, దండిగానే దండుకుంటున్నారట. గత రెండేళ్లలో ఎక్కువ మంది ప్రజలు వస్తువులు కొనడానికి, అమ్మడానికి అధికంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారని స్పష్టమైందట. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టింది. ఫేస్‌బుక్‌, ఫొటో షేరింగ్‌ సైట్‌ ఇన్‌స్టాగ్రాంలను ప్రైవేట్‌ గన్‌ సేల్స్‌కు వినియోగించుకోకుండా నిషేధించేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికాకు చెందిన ప్రఖ్యాత సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ వెల్లడించింది. సంస్థ తమ పాలసీని మార్చుకున్నట్లు తెల్పింది. గన్‌ డీలర్స్‌, తదితరులు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంల ద్వారా గన్‌ విక్రయాలు జరపకుండా నియంత్రిస్తున్నట్లు తెలిపింది. లైసెన్స్‌డ్‌ గన్‌ డీలర్స్‌కు తాజా నిబంధనలతో ఇబ్బందులేమీ ఉండబోవని సంస్థ స్పష్టం చేస్తోంది.

English summary