గాలి కూతురి పెళ్ళికి స్టార్ హీరోయిన్ల డాన్స్!

Priyamani and Rakul Preet Singh is dancing in gali daughter's marriage

12:11 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Priyamani and Rakul Preet Singh is dancing in gali daughter's marriage

ఓబుళాపురం గనుల రారాజుగా వెలుగొందిన గాలి జనార్ధనరెడ్డి ఎంతో వైభవోపేతంగా తన కూతురు బ్రాహ్మణి వివాహం జరపడానికి రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెల్సిందే. దాదాపు 250 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి కూడా. ఇక ఈ పెళ్లి గురించి ఒక్కో రోజు ఒక్కో వార్త వినబడుతోంది. జాతీయ మీడియా కూడా ఈ పెళ్లి పట్ల ఆసక్తి కనబరుస్తోంది. తాజాగా ఈ పెళ్లి గురించి ఓ హాట్ న్యూస్ సందడి చేస్తోంది. ఇంతకీ విషయం ఏమంటే, ఈ పెళ్లి వేడుకలో తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియమణి చిందేయనున్నారట.

ఆ వేడుకలో లైవ్ ఫెర్ఫార్మెన్స్ కోసం బాలీవుడ్ హీరోయిన్లను కూడా సంప్రదించినట్టు, అయితే వారెవరూ అంగీకరించకపోవడంతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న రకుల్ ను అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ప్రదర్శనకుగానూ కళ్లు చెదిరే మొత్తం ఇస్తామనడంతో రకుల్, ప్రియమణి ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తోంది. రకుల్ ప్రస్తుతం ధృవ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉంది. ఆ పెళ్లి సమయానికి భారత్ కు వచ్చేస్తే, కచ్చితంగా ఆ వేడుకలో డ్యాన్స్ చేస్తుందట. ఇంకా ఎన్ని వార్తలు వస్తాయో చూడాలి.

English summary

Priyamani and Rakul Preet Singh is dancing in gali daughter's marriage