ప్రియమణి నిశ్చితార్ధం అయింది అతనితోనా!?

Priyamani engagement with businessman

01:28 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Priyamani engagement with businessman

సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పీకల్లోతు ప్రేమలో బిజీ అయిపోయింది ప్రియమణి. అందరు హీరోయిన్స్ లాగానే ప్రియమణి కూడా మంచి బిజినెస్ మేన్ ను వల వేసి పట్టింది. ముస్తఫా రాజ్ అనే వ్యాపారితో ప్రేమలో పడింది. దాదాపు రెండేళ్లుగా వీళ్లు ప్రేమించుకుంటున్నారట. ఇక అన్ని భాషల్లో నటించిన ప్రియమణి ఇక అవకాశాలు రాకపోవడంతో దాదాపు సినిమాల నుండి కనుమరుగైపోయింది. ఇక పెళ్లికి ఇదే సరైన సమయం అని భావించిందేమో కానీ ప్రేమను పెళ్లి పట్టాలెక్కించింది. బెంగళూరులో శుక్రవారమే నిశ్చితార్ధం గ్రాండ్ గా చేసుకున్నా ఈ విషయాన్ని మీడియా వారికి చెప్పలేదు.

దగ్గరి ఫ్రెండ్స్, రిలేటివ్స్ మాత్రమే ఈ వేడుకకి హాజరయ్యారు. త్వరలోనే పెళ్లిచేసుకుంటామని అంటున్నా ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. ముస్తఫా ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ చేస్తున్నాడు. ఐపీఎల్ పార్టీలను కూడా తన కంపెనీనే చూస్తుంటుంది. అప్పుడే ఒక మ్యాచ్ సందర్భంగా మూడేళ్ల క్రితం వీరిద్దరూ కలిశారట. ఆ తర్వాత మాట్లాడుకోవటం, ఆ పరిచయం ప్రేమకు దారి తియ్యడం జరిగిపోయాయి. ఇంతకు ముందు ఇద్దరూ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు తిరిగి వచ్చారట. ప్రస్తుతం ఒక మళయాల సినిమా చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ నాటికి పెళ్లి చేసుకుంటారని టాక్.

English summary

Priyamani engagement with businessman