ప్రియమణి అవకాశాల్లేవని అది చేస్తుంది

Priyamani To Marry Mustafa Raj

05:41 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Priyamani To Marry Mustafa Raj

టాలీవుడ్‌ బ్లాక్‌ బ్యూటీ ప్రియమణి కొన్ని సంవత్సరాలు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, జగపతిబాబు వంటి స్టార్‌ హీరోలతో నటించిన ప్రియమణి గత రెండు సంవత్సరాలుగా అవకాశాలు లేక ఖాళీగా కుర్చుంది. ఇప్పుడు ప్రియమణి చేతిలో ఒక్కసినిమా కూడా లేదు. ఇంక తనకి అవకాశాలు రావని నిర్ణయించుకున్న ప్రియమణి ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రెండు సంవత్సరాలు క్రితం పరిచయమైన తన స్నేహితుడు ముస్తఫారాజ్‌ను ప్రియమణి పెళ్ళి చేసుకోబోతుంది. ఒక డ్యాన్స్‌ షోలో ముస్తాఫా ప్రియమణి కి పరిచయమయ్యాడట. అప్పటి నుండి వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇప్పుడు ఆ పరిచయమే వివాహానికి దారి తీస్తుంది. ముస్తఫా ముంబైలోని ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పని చేస్తున్నాడట. అంతా అనుకున్నట్లు జరిగితే ప్రియమణి ఈ ఏడాది చివర్లోనే ముస్తఫారాజ్‌ని పెళ్ళి చేసుకుంటానని ప్రకటించింటి. అంతేకాదు పెళ్ళి చేసుకున్నాక కూడా మంచి కథ వస్తే సినిమాల్లో నటించడానికి నేను సిద్ధమే అని ప్రకటించింది.

English summary

Heroine Priyamani was acted with almost all top heroes in the Telugu film industry and now she has no offers in the industry and Priyamani decide to get marry .Priyamani to get marry with an event manager named Mustafa Raj.