బాహుబలి -2లో ప్రియమణి!

Priyamani Visits Baahubali2 movie Sets

10:53 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Priyamani Visits Baahubali2 movie Sets

‘బాహుబలి 2’ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన వర్క్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో డైరెక్టర్ షేర్ చేసుకున్నాడు . ఐతే, తొలిరోజే హీరోయిన్ ప్రియమణి సెట్స్ లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ‘బాహుబలి 2’ షూటింగ్ చాలా బాగుందని, తనకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రియమణి ట్వీట్ చేసింది . దీంతో రకరకాలుగా స్టోరీలు అల్లేసుకోవడం ఆన్ లైన్ మీడియా వంతైంది.

ఆమెకు సీక్వెల్ లో ఏదైనా రోల్ ఇవ్వడం కోసమే రాజమౌళి పిలిచాడని సినీ లవర్స్ అంటున్నారు. లేకుంటే షూటింగ్ చూసేందుకు చెన్నై నుంచి ఫిల్మ్ సిటీకి ఆమె ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా ప్రియమణికి మ్యారేజ్ సెటిలైంది. పెళ్లిపనులు వదిలి షూట్ రావడం వెనుక కచ్చితంగా ఏదో రోల్ ఇచ్చివుంటాడని, ఎందుకంటే, గతంలో ‘యమదొంగ’లో నటించిన నేపధ్యంలో అప్పట్నుంచి రాజమౌళితో ప్రియకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి బాహుబలి 2 గురించి ఏదోవిధంగా సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైపోయింది. షూటింగ్ ఫినిష్ అయ్యేలోపు ఇంకెన్ని రూమర్లు చక్కర్లు కొడతాయో చూడాలి. మరిన్ని ట్విస్ట్ లు ఉంటాయో.

ఇది కూడా చూడండి:'ఒక్క అమ్మాయి తప్ప' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి:మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

ఇది కూడా చూడండి:హీరోలు వారి మేనరిజం

English summary

Tollywood Heroin Priyamani Visits Baahubali2 movie Sets for climax seen.