ఈ ఏడాది బాగా కలిసొచ్చిందట

Priyanka Chopra About Padma Sri Award

12:54 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Priyanka Chopra About Padma Sri Award

కలలు కనే బాలివుడ్ భామ కు కల నిజమైతే ఆ ఖుషీయే వేరు కదా... అందుకే ప్రముఖ బాలీవుడ్‌నటి ప్రియాంక చోప్రా మురిసిపొంతోంది. నిజం చెప్పాలంటే తన కల నిజమైనట్లు అనిపిస్తోందంటూ ఉబ్బితబ్బిబవుతోంది. ప్రియాంక చోప్రాకి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, తాను పడ్డ కష్టానికి ప్రతిఫలమే ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం అంది ఓ ఇంటర్వ్యూలో.... ఆమె నటించిన దిల్‌ దఢకనే దో, క్వాంటికో, బాజీరావ్‌ మస్తానీలకు పీపుల్స్‌ ఛాయిస్‌తో పాటు ఇప్పుడు పద్మశ్రీ తోడవడం ఎంతో ఆనందం కల్గించిందని ఆమె అన్నారు.

ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో మిగతా ఎపిసోడ్‌ షూటింగ్‌తో పాటు ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహిస్తున్న ‘జై గంగాజల్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక, తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, తన శ్రమ, ప్రతిభను గుర్తించినందుకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనని అంటోంది. అంతే కాదు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పింది. ఓ ఆర్మీ అధికారి కుమార్తెగా ఈ పురస్కారం అందుకుంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెబుతోంది.

English summary

One of the Bollywood top actress Priyanka Chopra says that she was very happy for getting Padma Sri Award to her.She also says that she was very proud to get award as a army official daughter