ప్రియుడు కోసం ఆత్మహత్య చేసుకోబోయిన ప్రియాంక!

Priyanka Chopra attempted for suicide

10:58 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Priyanka Chopra attempted for suicide

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హిందీలో దీపికా పదుకొనే తో పాటు సమానంగా టాప్‌ హీరోయిన్‌ గా వెలుగొందుతుంది. అంతే కాదు ఈ అమ్మడు హాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది. అయితే కెరీర్‌ ఇంత పీక్స్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రియాంక ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంది? అసలు ఏం జరిగింది? అనే ఆలోచనలు మీలో మెదలవచ్చు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ప్రియాంక చోప్రా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఇప్పుడు కాదు, గతంలో. అవును గతంలో ప్రియాంక చోప్రా దగ్గర ప్రకాష్‌ జాజూ అనే మేనేజర్‌ పని చేసేవాడట.

అతనే ప్రియాంక కి సంబంధించిన వ్యక్తిగత పనులన్నీ చూసుకుంటూ ప్రియాంక వాళ్ల కుటుంబానికి దగ్గరయ్యాడట. అయితే ఇప్పుడు ఆ ప్రకాష్‌ జాజూనే గతంలో ప్రియాంక చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడింది అంటూ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. ప్రియాంక మాజీ ప్రియుడైన అసీమ్‌ మర్చంట్‌తో గొడవ అయినప్పుడు ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది అంటూ తెలియజేశాడు. అంతే కాదు ప్రియాంక అసీమ్‌ తల్లితో బాగా సన్నిహితంగా ఉండేదట. అయితే అసీమ్‌ తల్లి చనిపోయినప్పుడు అసీమ్‌ తన తల్లి మరణవార్త ప్రియాంకకు తెలియజేయలేదని మనస్తాపం చెంది కూడా ఆత్మహత్యకు పాల్పడిందట.

ఇలా పలు మార్లు ప్రియాంక ఆత్మహత్య చేసుకోబోతుండగా నేనే స్వయంగా కాపాడానంటూ ప్రకాష్‌ జాజూ తెలిపాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇది హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఏంటీ ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడిందా అంటూ చర్చించుకుంటున్నారు.

English summary

Priyanka Chopra attempted for suicide. Priyanka Chopra personal manager Prakash Jaju said that she attempted 2 times for suicide.