కటకటాల వెనుక ప్రియాంక బ్రదర్

Priyanka Chopra brother arrested in Pune

11:25 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Priyanka Chopra brother arrested in Pune

అన్ని వేళలు మనవి కావని అందుకే అన్నారు. అందుకే ఎప్పుడూ హాట్ టాపిక్ లాంటి విషయాలతో వార్తలకెక్కే టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు ఇప్పుడు కుటుంబం వైపు నుంచి ఒక బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ వచ్చి చేరింది. హోటల్ మేనేజ్మెంట్ పట్టా అందుకున్న ప్రియాంక బ్రదర్ సిద్ధార్థ్, పూణె దగ్గర ఓ హోటల్ నడుపుతున్నాడు. 'ద మగ్ షాట్ లాంజ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ హోటల్ లో పోలీసులు ఇటీవల దాడి చేశారు. ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోందంటూ చేసిన ఈ దాడిలో భారీ ఎత్తున క్యాష్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కంగుతిన్న ప్రియాంకకు మూడు నెలలు తిరగకముందే మరో చేదువార్త వచ్చి పడింది.

సరిగ్గా అదే హోటల్ లో హుక్కాతోపాటు విచ్చలవిడిగా స్మోకింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు జరిపారు. నిజానికి ఆ ఏరియా మొత్తం నో స్మోకింగ్ జోన్ కింద ప్రకటించారు. చట్ట విరుద్ధంగా సాగుతున్న వ్యవహారం కావడంతో పోలీసులు దాడి చేయాల్సివచ్చింది. ఈ వ్యవహారంలో మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి, మేనేజర్ పై కేసు నమోదు చేశారు. పదేపదే తమ కుటుంబ సభ్యుడి వలన ప్రియాంక సోదరుడి మూలంగా తాము వార్తల్లోకెక్కి అవమానాలు భరించాల్సి వస్తోందని ప్రియాంక ఫ్యామిలీ మెంబర్స్ వాపోతున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంత ఇమేజ్ దక్కించుకున్న ప్రియాంకకు ఈ చిల్లర గొడవలు ఏమిటంటూ ఫ్యామిలీ సభ్యులతోపాటు అభిమానులు కూడా వాపోతున్నారు.

ఒక పక్క హాలీవుడ్ లో సైతం తిరుగులేని స్టార్ గా పేరు తెచ్చుకుంటున్న ప్రియాంకకు బ్రదర్ మూలంగా తలదించుకోవాల్సి వచ్చిందని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే ప్రియాంకకు, అమెరికా అధ్యక్షుడు ఒబామాతో డిన్నర్ చేసే అరుదైన అవకాశం కూడా లభించింది. ఈసందర్బంగా ఒబామా దంపతులు ఆమెని అభినందించారు కూడా. పాపం ఇంతలోనే చేదు వార్తలు చుట్టుముడుతున్నాయి.

English summary

Priyanka Chopra brother arrested in Pune