ప్రియాంక చోప్రా ఆత్యహత్యాయత్నం

Priyanka Chopra Former Manager Shocking Comments

10:29 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Priyanka Chopra Former Manager Shocking Comments

బాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఆత్యహత్యకు ప్రయత్నం చేసిందట. అది కూడా 2002లోనేనట. చోప్రా 3 సార్లు ఆత్మహత్యకు యత్నించిందన్న విషయాన్ని ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జజూ ట్విటర్‌లో తెలిపాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. 2002లో ప్రియాంక చోప్రా ప్రేమ వ్యవహారం వల్ల చాలా ఇబ్బందులు పడిందని... కొన్నాళ్లకు ఆమె ప్రియుడు అసీమ్ తల్లి చనిపోయిందని ట్వీట్ చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియాంక ఆత్మహత్యకు యత్నించిందని, ఆ తర్వాత కూడా అసీమ్, ప్రియాంక కొన్ని రోజులు అర్థరాత్రి దాకా గొడవ పడేవారని... ఆ తర్వాత రెండు సార్లు ప్రియాంక ఆత్మహత్యకు యత్నించిందని.. తానే అడ్డుపడ్డానని జజూ వివరించాడు. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయమని ట్వీట్ చేశాడు. 18 నుంచి 19 సంవత్సర మధ్యలో ఉన్న అమ్మాయిలు సినిమాల్లో నటించవద్దని జుజూ ట్వీట్ చేయడం కూడా మరో సంచలనం అయింది.

ఇవి కుడా చదవండి :

ఎటిఎం నే ఎత్తుకెళ్ళి పోయారట

ఐటెం సాంగ్ కీ రెడీ

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

English summary

Priyanka Chopra Ex- Manager Prakash Jaju made some controversial comments on Priyanka Chopra. He says that Priyanka Chopra Attempted to commit suicide for three times.