కష్టమైనా సరే ఇష్టంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా

Priyanka Chopra getting trained in Marshal arts

11:42 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Priyanka Chopra getting trained in Marshal arts

అమెరికాలో ‘కజుకెంబో’ను హైబ్రిడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అంటారు. ఎందుకంటే కరాటే, ట్యాంగ్‌ సూ, జుడో, కెంపో, వెస్టర్న్‌ అండ్‌ చైనీస్‌ బాక్సింగ్‌ను మిక్సీలో వేస్తే అన్నీ కలిపి ‘కజుకెంబో’ అయ్యిందన్నమాట. అందుకే సరికొత్త మార్షల్‌ ఆర్ట్స్‌ కోసం ప్రియాంక తెగ కసరత్తులు చేసేస్తోంది. ఆమె నటిస్తున్న పాపులర్‌ టీవీ సిరీస్‌ ‘బే వాచ్‌’ కోసమే, కష్టమైనా సరే ఇష్టంగా ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటోంది. మొత్తానికి ప్రియాంక చోప్రా వ్యక్తిగత శిక్షకుడి సహాయంతో ఈ అమెరికన్‌ హైబ్రిడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ను సీరియస్‌గా నేర్చుకుంటోంది. ప్రియాంక చోప్రా ఇలా కెరీర్‌పై ప్రేమతో కష్టపడటం కొత్తేం కాదు. ఎందుకంటే.. ‘డాన్‌’, ‘ద్రోణ’ చిత్రాలకోసం స్టంట్స్‌ నేర్చుకున్న ప్రియాంక, లేడీఓరియంటెడ్‌ చిత్రాలంటే ఆషామాషీగా నటించటం కాదని ‘మేరికోమ్‌’ చిత్రంతో చాటి చెప్పింది.

ఇక హీరోలకు ఏమాత్రం తీసిపోననే రీతిలో ప్రియాంక ‘మేరీకోమ్‌’ చిత్రం కోసం నెలల తరబడి, శ్రమించి బాక్సింగ్‌ నేర్చుకుంది. కేవలం నేర్చుకోవటం కాదు అందులో పట్టు సంపాదించింది. కాస్త గమనిస్తే ‘మేరికోమ్‌’ రోల్‌ కోసం ఎంత కఠినమైన సాధన చేసిందో ఆ సినిమాలో కనిపిస్తుంది. ఇటీవలే వచ్చిన ‘జై గంగాజల్‌’ మూవీ కోసం కూడా ఫైట్‌ సీక్వెన్స్‌లు ప్రాక్టీస్‌ చేసిన ప్రియాంక, ఇప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌ కోసం తెగ కష్టపడుతోంది.

English summary

Priyanka Chopra getting trained in Marshal arts. Bollywood hot beauty Priyanka Chopra training in Marshal Arts.