ఆస్కార్‌ ఇచ్చేది ప్రియాంకానా?!

Priyanka Chopra is the presenter of Oscar awards

04:47 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Priyanka Chopra is the presenter of Oscar awards

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా దశ ఇప్పుడు బాగా తిరిగుతుంది. హాలీవుడ్‌ లో ఛాన్స్‌ కొట్టేసిన ప్రియాంక హాలీవుడ్‌ టీవి సిరీస్‌ క్వాంటికోలో హాట్‌హాట్‌గా నటించి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది. ఇందులో ప్రియంక నటనకుగాను పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌కి సంబంధించి రెండో భాగం ఘాటింగ్‌ ప్రారంభమయింది. ఇదిలా ఉండగా ప్రియాంకకి మరో అరుదైన గౌరవం దక్కింది. అదేంటందే ఫిబ్రవరి 28(మన టైమ్‌లో 29 తెల్లవారు జామున)న జరగనున్న ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ప్రెజెంటర్‌గా ప్రియాంక ఎంపికయ్యింది. అవార్డుల ప్రధానం చేసే వారి పేర్లు ఆస్కార్‌ అకాడమీ ట్విట్టర్‌లో ఆ జాబితాని పోస్ట్‌ చేసింది. ఆ జాబితాలో ప్రియాంక చోప్రా పేరు కూడా ఉంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియాంక ఆ కార్యక్రమం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ప్రియాంక ప్రస్తుతం 'జై గంగాజల్‌' చిత్రంలో నటిస్తుంది.

English summary

Bollywood hot beauty Priyanka Chopra is selected as a presenter of Oscar awards. Oscar awards function is being held on Febraury 28th(29th Indian time) evening.