సెక్సీయెస్ట్ ఉమెన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ!!

Priyanka Chopra recieving Asia Sexiest Woman award

03:26 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Priyanka Chopra recieving Asia Sexiest Woman award

ప్రతీ ఏటా నిర్వహించే 'ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్‌' అవార్డు పోటీలలో ఈ సంవత్సరం బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎంపికయింది. వరుసగా నాలుగు సంవత్సరాలలో మూడోసారి ప్రియాంక చోప్రా 'ఆసియా సెక్సీయెస్ట్‌ ఉమెన్‌'గా ఎంపిక కావడం విశేషం. లండన్‌ కి చెందిన 'ఈస్ట్రన్‌ ఐ' అనే పత్రిక వారు ఈ జాబితాను విడుదల చేయగా సామాజికి, మాధ్యమాల ద్వారా నిర్వహించిన పోల్‌లో ఎక్కువ శాతం ప్రియాంక చోప్రాకే ఓటు వేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక ఆనందానికి హద్దులు లేవు, తనకి ఓటు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరికీ, అలాగే ఈ అవార్డు పోటీని నిర్వహించిన 'ఈస్ట్రన్‌ ఐ' పత్రిక వారికి నా కృతజ్ఞతలు అని చెప్పింది ప్రియాంక.

హాలీవుడ్‌ టీవీ సీరియల్‌లో నగ్నంగా, అర్ధనగ్నంగా నటించి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది ప్రియాంక చోప్రా. ఇంతే కాకుండా ఈ 'ఆసియా సెక్సీయస్ట్‌ ఉమెన్‌' జాబితాలో తొలి యాభైలో భారత్‌ కు చెందినవారు ఉండటం కూడా గమనార్హం. నాలుగో స్థానంలో దీపికా పదుకొనే ఉండగా, ఐదవ స్థానంలో కత్రినా కైఫ్‌ ఉంది.

English summary

Priyanka Chopra recieving Asia Sexiest Woman award.