అమ్మో, 40రోజుల్లో రూ 100 కోట్ల సంపాదనా?

Priyanka Chopra To Earn 100 Crores In 40 Days

03:22 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Priyanka Chopra To Earn 100 Crores In 40 Days

అవును, ఇంత పెద్ద మొత్తంలో మొత్తంలో సంపాదించిన బాలీవుడ్ సెలబ్రిటీగా ప్రియాంక చోప్రా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇప్పటికే అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో ప్రియాంక చోప్రాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ గుర్తింపుతోనే హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తోంది. ఇప్పటి వరకు క్వాంటికో రెండో సీజన్.. బేవాచ్ చిత్ర షూటింగ్ల్లో బిజీగా గడిపిన ఈ భామ.. తన తదుపరి షెడ్యూల్కి 40 రోజులు గ్యాప్& రావడంతో భారత్ వస్తోంది. నలభై రోజుల విరామంతో భారత్ వస్తున్న ప్రియాంక.. ప్రముఖ సంస్థల వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుందట. ఈ ట్రిప్లో ప్రియాంక దాదాపు రూ.100 కోట్లు వెనకేసుకోనుందని అంటున్నారు.

దాదాపు ఈ నెలన్నరలో 24 ప్రకటనల షూటింగుల్లో పాల్గొనబోతోందట. ఆ డీల్ విలువ దాదాపు రూ.100 కోట్ల దాకా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు లేక్కకడుతున్నాయి. దీంతో కేవలం 40 రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో సంపాదించిన బాలీవుడ్ సెలబ్రిటీగా ప్రియాంక సరికొత్త రికార్డు సృష్టించబోతోందని అంటున్నారు.

చాలా రోజులుగా క్వాంటికో.. బేవాచ్ షూటింగులతో బిజీగా గడిపిన పీసీకి బాలీవుడ్ నుంచి బోలెడు ఆఫర్లు వస్తున్నాయట. అయితే.. తనకు సమయం దొరకడం లేదని.. హిందీ ప్రాజెక్టులపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఇటీవల చెప్పింది. భారత్కు వచ్చాక ఆ విషయంపై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటి కి అటు సినిమాలు , టివి సిరీస్ లతో పాటూ బిజినెస్ యాడ్స్ లో కూడా బానే సంపాదిస్తోంది మరి.

ఇవి కూడా చదవండి:ఒకే సినిమాలో తండ్రి కొడుకు పాత్రల్లో అలరించిన మన హీరోలు

ఇవి కూడా చదవండి:ఢిల్లీలోని ఆ కాలేజీలో ప్రతీ రోజు రేప్ లు జరుగుతాయట!

ఇవి కూడా చదవండి:ఎన్టీఆర్,బన్నీ లతో మల్టీ స్టారర్!

English summary

Bollywood Heroine Priyanka Chopra was presently acting in Bay Watch movie in Hollywood and Quantico -2 series . Now she was coming to India and she will be in India for 40 Days and she was going to act in Advertisements in these 40 days and she was going to earn 100 crores for that Advertisements.