ప్రియాంక మనస్సు ఇక్కడే

Priyanka Chopra Tweet On Ki And Ka Movie

09:44 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Priyanka Chopra Tweet On Ki And Ka Movie

ఓ పక్క హాలీవుడ్‌ షూటింగ్‌లతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా మనస్సు మాత్రం బాలీవుడ్‌ మీదే వుంది . అందుకే బాలీవుడ్ లో జరుగుతున్నాదేదీ మిస్‌ కాకుండా ఏం జరుగుతున్నదీ ఎప్పటికప్పుడు వాకబు చేస్తూనే వుంది. అందుకే తాజాగా ‘కీ అండ్‌ కా’ చిత్రంలో జంటగా నటించిన అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌లను ఈ వగలాడి అభినందించింది. ఆర్‌. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌, ఓ పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాటిని తిలకించిన ప్రియాంక తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా ఎంతో బాగుందని, విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. చిత్ర బృందాన్ని కూడా అభినందించింది. ఏప్రిల్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary

Bollywood Heroine Priyanka Chopra was acting in Holllywood movie with Rock and she was participating in that Hollywood movie.She says that even though she was in Hollywood , she will think about Bollywood movies.She posted a post on twitter by praising Ki and Ka movie .