‘జంగిల్‌ బుక్‌’లో  ప్రియాంక వాయిస్‌

Priyanka Chopra Voice Over for Jungle Book

01:22 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Priyanka Chopra Voice Over for Jungle Book

వాల్ట్‌డిస్నీ బ్యానర్‌ పై రూపొందిస్తున్న అమెరికన్‌ ఫాంటసీ చిత్రం ‘ద జంగిల్‌ బుక్‌’ కి బాలీవుడ్‌ నటులు తమ వాయిస్ అందిస్తున్నారు. ద జంగిల్‌ బుక్‌ హిందీ వెర్షన్‌కు బాలీవుడ్‌ నటీనటులు ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్‌ఖాన్‌, నానా పటేకర్‌, ఓం పురి, షెఫాలి షా వాయిస్‌ ఇచ్చారు. ఈ చిత్రంలోని పలు పాత్రలకు అంటే, పైథాన్‌ ‘కా’ కి ప్రియాంక, బేర్‌ ‘బాలూ’కి ఇర్ఫాన్‌ఖాన్‌, వుల్ఫ్‌ ‘రక్షా’కి షెఫాలి షా, బ్లాక్‌ పాంథర్‌ ‘బఘీరా’కి ఓం పురి, షేర్‌ ఖాన్‌ టైగర్‌కు నానా పటేకర్‌ డబ్బింగ్‌ చెప్తున్నారు. జాన్‌ ఫావ్రూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. యూఎస్‌లో కంటే వారం ముందుగానే అంటే ఏప్రిల్‌ 8న భారతదేశంలో జంగిల్‌ బుక్‌ విడుదల ప్రేక్షకులను అలరించడానికి రానుంది. గతంలో నానా పటేకర్‌ 1990లో వచ్చిన ‘జంగిల్‌ బుక్‌: ద అడ్వెంచర్‌ ఆఫ్‌ మోగ్లి’ యానిమేటెడ్‌ సిరీస్‌కు వాయిస్‌ ఓవర్‌గా వ్యవహరించగా, ఈ సిరీస్‌ దూరదర్శన్‌ ఛానెల్‌లో ప్రసారమయ్యింది. ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు డిస్నీ బాలీవుడ్‌ ప్రముఖులతో వాయిస్‌ ఓవర్‌ ఇస్తుంది. ప్రియాంక వాయిస్ ఇవ్వడం ఓ అద్భుతమని అంటున్నారు.

English summary

The most awaited Hollywood movie of this year was Jungle Book.This movie was going to be release on a week before in India than in US.Bollywood actors like Priyanka Chopra, Irfan Khan and Nana Patekar was giving their voice for the Hindi version of this movie.