ప్రియాంకకు దాదాసాహెబ్‌ అవార్డ్‌ రిపీట్

Priyanka Chopra win Dadasaheb Phalke Award For The Second Time

10:43 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Priyanka Chopra win Dadasaheb Phalke Award For The Second Time

నటనాపరంగా తన విజయాలకు ఇప్పటివరకు ఎన్నో పురస్కారాలు అందుకున్న బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు ఈ ఏటి ఉత్తమనటిగా ఎంపికైంది. అంతేకాదు మరోసారి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకోనుంది. దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫౌండేషన్‌ ఏటా ఈ అవార్డును ఇస్తోంది. 2011లో వచ్చిన ‘సాత్‌ ఖూన్‌ మాఫ్‌’ చిత్రానికి ప్రియాంక మొదటి దాదా సాహెబ్‌ అవార్డ్‌ను అందుకుంది. ఇప్పుడు బాజీరావ్‌ మస్తానీ సినిమాకి రెండో అవార్డ్‌ అందుకోబోతోంది. ఏప్రిల్‌ 30న దాదా సాహెబ్‌ ఫాల్కే 147వ జయంతిని పురస్కరించుకుని 24న దాదాసాహెబ్‌ ఫిల్మ్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని ముంబయిలో నిర్వహించబోతున్నారు. బే వాచ్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం అమెరికాలో రెండు నెలలు గడిపిన ప్రియాంక త్వరలో ముంబయి చేరుకోనుంది.

ఇవి కూడా చదవండి :

ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

నా దగ్గర డబ్బుల్లేవ్ .. నెల గడవడమే కష్టంగా వుంది

మైనర్ అనుమతితో సెక్స్ చేసినా శిక్ష తప్పదట

English summary

Bollywood Heroine Priyanka Chopra wins Dadasaheb Award for the second time in her movie career.This time Priyanka Chopra win Dadasaheb award for the second time for Bajirao Mastani movie. Now Priyanka Chopra was acting in Bay Watch in Hollywood.