ప్రియాంకే బెటర్! .. పాపం రాహూల్ ..

Priyanka will campaign in Uttar Pradesh

11:05 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Priyanka will campaign in Uttar Pradesh

కాబోయే ప్రధాని కాబోయే ప్రధాని అంటూ యుపి ఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ వాళ్ళు తెగ ఊదర గొట్టేసారు. తీరా 2014ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓటమి చెందేసరికి దిమ్మ తిరిగిపోయింది. ఈ రెండేళ్లలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం మార్చినట్లు చెబుతున్నారు. అందునా కీలకమైన యూపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తగిన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రచార బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై నేతలు ఆలోచన చేస్తున్నారు. తాజా సర్వే ప్రకారం రాహుల్ కంటే ప్రియాంక వైపే అన్నివర్గాలు మొగ్గు చూపుతున్నారట.

ప్రచార పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందన్న దానిపై స్థానిక నేతలు రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 600 శాంపిల్స్ సేకరించారు. అందులో 500 మంది ప్రియాంకకు అనుకూలంగా ఓటేశారట. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల ప్రచార సారధిగా ప్రియాంకనే కన్ఫార్మ్ చేస్తారన్న ఊహాగానాలు బలపడ్డాయి.

మొన్నటి అసెంబ్లీ ఎన్ని్కల్లో రెండురాష్ర్టాలను జారవిడుచుకున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ రీప్లేస్ మెంట్ పై సీరియస్ గా ఆలోచించడానికి ఇదే సరైన తరుణమని కేడర్ భావిస్తోంది. యూపీ ఎన్నికలను సెమీఫైనల్ గా భావిస్తున్న ఏఐసీసీ, ఒక కఠినమైన నిర్ణయం వైపు మొగ్గు చూపవచ్చన్నది వాళ్ల వెర్షన్. అందుకే ఉత్తరప్రదేశ్ క్యాన్వాసింగ్ కోసం ప్రియాంకతో ప్రయోగం చేయాలని సోనియా డిసైడ్ అయినా ఆశ్చర్యం వుండకపోవచ్చు. రేపోమాపో ఈ మేరకు ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం కూడా వుంది. పాపం రాకుమారుడు రాహూల్ పరిస్థితి ఇలా తిరగబడిందేంటి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: శ్రీమన్నారాయణుడు రహస్యంగా సేదతీరే వైకుంఠ గుహ తిరుమలలో

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

ఇది కూడా చూడండి: శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

English summary

Priyanka will campaign in Uttar Pradesh. According to the survey Priyanka Gandhi is better than rahul gandhi.