పోలవరం ముందుకి సాగేనా ?

Problems To Polavaram Project

01:07 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Problems To Polavaram Project

ఎన్నో ఏళ్ళనాటి పోలవరం ప్రాజెక్ట్ కల నెరవేరుతుందా , లేదా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఏదో ఒక అడ్డంకి పోలవరాన్ని ముందుకి సాగానీయడం లేదు. ఇప్పటికే ఎన్నో అవాంతరాలను అధిగమించినా , సమస్య మళ్ళీ మొదటికి వస్తోంది. తాజాగా ఓడిశా ఎంపి ల ఆందోళన పోలవరం ప్రాజెక్ట్ కి ఇబ్బందిగా మారుతుందా అనిపించేలా వుంది. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఓడిశా ఎంపిలు పోలవరం ప్రాజెక్ట్ వలన తమ ప్రాంతానికి ఇబ్బంది అవుతుందని , ముంపున పడతామని నిరసన తెల్పుతూ , నినాదాలు చేసారు.

రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా చేస్తామని ప్రకటించారు. విభజన అనంతరం ఎన్నికలు జరగడం , కొత్త ప్రభుత్వాలు కొలువు దీరాక పోలవరం ముంపు మండలాలు ఎపిలో కలిసేలా పావులు కదిపి , అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ కి ఇబ్బంది లేదని అనుకున్నారు. ఈలోగా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ చేపట్టడం , పోలవరానికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం , వంటి పరిణామాలతో పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇప్పుడు ఓడిశా రాష్ట్రం నుంచి నిరసన గళం వినిపిస్తుండడం తో పోలవరం ముందుకి సాగుతుందా అన్న అనుమానం సహజంగానే ఏర్పడుతోంది.

English summary

Problems for Polavaram project in andhra pradesh has still facing problems.Orissa MP's Have raised their voice against the construction of Polavaram Project