ఈ యాప్స్ తో చిక్కులే..

Problems with mobile apps

04:58 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Problems with mobile apps

సెల్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరం. ఏ అవసరం వచ్చినా మొబైలే ఆధారం. ఇక మన అవసరాలకు తగ్గట్లు వేల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ యాప్ పడితే ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చిక్కులు తప్పవట. కొన్ని యాప్స్ మన వ్యక్తిగత వివరాలను లాగేసుకుంటున్నాయట. ఓ తాజా అధ్యయనం లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్ లోడ్ చేసుకుని వాడే యాప్స్ లో 9 శాతం యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటున్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. కొన్ని యాప్స్ క్రియేటర్స్ తమ స్వలాభం ప్లే స్టోర్స్ లో రిజిస్ట్రర్ అవుతారు. తమ అవసరాల కోసం కొన్ని కండీషన్లు పెడుతుంటారు. అయితే యూజర్లు ఈ విషయాలేవీ పట్టించుకోకుండా యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని తెగ వాడేస్తున్నారట. 13,500 రకాల ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్ పై అధ్యయనం చేసి ఈ వివరాలు తెలిపారు. 2.5 లక్షల యూఆర్ఎల్స్ నుంచి ఈ యాప్స్ యాక్సెస్ చేసుకుంటున్నారని వీటీలో కొన్ని మాత్రమే సరైనవని ఆండ్రాయిడ్ యూఆర్ఎస్ రిస్క్ యాక్సెసర్ గ్రూప్ తమ అధ్యయనంలో తేల్చింది. ఆప్లికేషన్లను వాడే ముందు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాటిని వాడకపోవడమే మంచిదని పరిశోధకులు సూచించారు.

English summary

California University reseachers found that the mobile apps which was available on google play was taking the personnel information of the user.They says that we should not download some apps