నిత్యాకు క్లాసు పీకిన అశ్వనీదత్!

Producer Ashwini Dutt Gave Warning To Heroine Nithya Menon

11:39 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Producer Ashwini Dutt Gave Warning To Heroine Nithya Menon

అవునా, డిసిప్లిన్ గల హీరోయిన్ నిత్యామీనన్ కు సౌమ్యంగా వుండే టాలీవుడ్ నిర్మాత అశ్వనీ దత్ ఫుల్ క్లాస్ పీకడం ఏమిటి? ఏమైందో ఏమో గానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే టాక్ నడుస్తోంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించాలని భావిస్తోన్న తన లేటెస్ట్ మూవీ లో నిత్యాను తీసుకున్నాడు అశ్వనీదత్. అయితే, ముక్కుసూటిగా మాట్లాడుతుందని పేరున్న నిత్యా గురించి దత్ కు కొంత మంది నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. సెట్ లో పొగరుగా ఉండడమే కాకుండా, తన ప్రవర్తనతో దర్శకనిర్మాతలను ఇబ్బందిపెడుతుందని వినడంతో అశ్వనీ దత్ నిత్యాను పిలిచి మాట్లాడినట్టు భోగట్టా.

సెట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని, షూటింగ్ కు సరైన సమయంలో రావాలని, డైరెక్టర్ పనుల్లో ఏమాత్రం వేలు పెట్టకూడదని గట్టిగా చెప్పాడట. అంతేకాదు, సినిమా ప్రమోషన్ కు సహకరించకపోతే రెమ్యునరేషన్ లో కోత పెడతానని కూడా దత్తూ చెప్పాడట. మహానటి జీవితం ఆధారంగా తీయబోతోన్న ఈ సినిమాకు అశ్వనీ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ కథను తయారు చేయడమే కాక, ఆయనే దర్శకత్వం వహించబోతున్నాడు. మరి దత్ క్లాస్ ప్రభావం నిత్యాపై ఎలా ఉంటుందో చూడాలి.

ఇది కూడా చూడండి: 5న్నర కోట్లు ఇస్తామంటే పొమ్మన్నాడు

ఇది కూడా చూడండి: వావ్, మెగా ఫాన్స్ లక్ష్యం ఇదా!

ఇది కూడా చూడండి: ఇకపై ఆ.. ఆట ఆడాలంటే 18 ఏళ్ళు ఉండాల్సిందేనట!

English summary

Top Producer Ashwini dutt gave warning to beautiful heroine nithya menon.