'బండ్ల గణేశ్' గుడ్లు ఏరుకుంటున్నాడు!!

Producer Bandla Ganesh with eggs

03:57 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Producer Bandla Ganesh with eggs

కమీడియన్ నుండి ప్రొడ్యూసర్‌ గా మారిన బండ్ల గణేష్‌ రవితేజతో 'ఆంజనేయులు' చిత్రం నిర్మించి తొలి చిత్రమే ఫ్లాప్‌ అందుకున్నాడు. ఆ తరువాత పవణ్‌కళ్యాణ్‌ తో 'తీన్‌మార్‌' చిత్రం నిర్మించాడు. అది కూడా అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డాడు. ఆ తరువాత మళ్లీ పవణ్‌కళ్యాణ్‌ తో 'గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని నిర్మించాడు. అది సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఇంక బండ్ల గణేష్‌ వరుస పెట్టి సినిమాలు తీసాడు. ఎన్టీఆర్‌తో బాద్‌షా, అల్లు అర్జున్‌ తో ఇద్దరమ్మాయిలతో, రామ్‌చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే, 2015 ప్రాంభంలో ఎన్టీఆర్‌తో 'టెంపర్‌' చిత్రాలని నిర్మించాడు.

ఈ సంవత్సరంలో టెంపర్‌ చిత్రం సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బడా ప్రొడ్యూసర్‌ మొత్తానికి కనబడటం మానేశాడు. ఎప్పుడూ ఆడియో ఫంక్షన్లలో, సినిమా ఫంక్షన్లలో దర్శనమిచ్చే బండ్ల గణేష్‌ టెంపర్‌ సినిమా విడుదలయ్యాక మొత్తానికి కనబడటమే మానేశాడు. టెంపర్‌ సూపర్‌ హిట్టయినా ఫైనాన్సియల్‌గా ఏమైనా నష్ట పోయాడా? అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్‌కి శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కోళ్ళ ఫారాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బండ్ల గణేష్‌ తన పౌల్ట్రీ ఫామ్‌లో కోడిగుడ్లు ఏరుతూ కనిపించాడు. ఒక్కసారిగా సినీ రంగానికి దూరంగా ఉంటూ ఇలా కోడి గుడ్లు ఏరుతున్నాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అసలు విషయం ఏంటో వివరణ ఇమ్మని నెటిజన్లు బండ్ల గణేష్‌ ని కోరుతున్నారు. అసలేమయిందో తెలియాలరటే బండ్ల గణేష్‌ నోరు విప్పాల్సిందే మరి..

English summary

Producer Bandla Ganesh with eggs in his Poultry form.