కన్నడ హీరోయిన్‌ పై కేసు పెట్టిన నిర్మాత!

Producer filed case on Kannada Heroine in Bangalore police station

12:45 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Producer filed case on Kannada Heroine in Bangalore police station

కన్నడ హాట్ బ్యూటీ రాగిణీ ద్వివేది పై బెంగళూరు జేపీ నగర్‌ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే 'నాటుకోలి' అనే చిత్రానికి గానూ ఈ చిత్ర నిర్మాత వెంకటేష్‌ రాగిణీ ద్వివేదికి 16 లక్షలు పారితోషికం ఇచ్చేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనుకున్న విధంగానే ముందుగా 10 లక్షల అడ్వాన్స్‌ రాగిణీ సోదరుడైన దీక్షిత్‌కి ఇచ్చాడు. ఇప్పుడు 'నాటుకోలి' చిత్రం షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోవడంతో వెంకటేష్‌ ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయమని రాగిణీని కోరాడు. అయితే రాగిణీ మాత్రం అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని కావాలంటే తను నిర్మించబోయే వేరే చిత్రంలో నటిస్తానని చెప్పింది.

వెంకటేష్‌ చేసేది లేక హీరోయిన్‌ రాగిణీ పైన ఆమె సోదరుడు దీక్షిత్‌ పైన పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్‌ చేయించాడు. పోలీసులు రాగిణీ పై దర్యాప్తు ప్రారంభించారు.

English summary

Producer filed case on Kannada Heroine Ragini Dwivedi in Bangalore police station. Because She is not giving back 10 lakhs advance to producer.