చిరుకు పెళ్లి చేసిన జయకృష్ణ ఇకలేరు

Producer Jaya Krishna Passes Away

10:09 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Producer Jaya Krishna Passes Away

ప్రముఖ సినీ నిర్మాత, జయకృష్ణ మూవీస్‌ అధినేత కె.జయకృష్ణ(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి దగ్గర్లో గల కోమర్రు ఆయన స్వగ్రామం. 1941 ఆగస్ట్‌, 18న జన్మించిన జయకృష్ణ చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన ఆయన సోదరుడు వీరభద్రరావుతో కలిసి తన మేనమామల దగ్గర పెరిగారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని తన సొంతూరుని విడిచి 1961 మార్చి 3న చెన్నై బయలుదేరారు. మేనబావల సహకారంలో సి. నాగేశ్వరరావు దగ్గర కెమెరా అసిస్టెంట్‌గా చేశారు. లైట్‌మెన్‌ల డామినేషన్ తట్టుకోలేక ఖాళీగా నిలబడే పని చేయడం ఇష్టంలేక అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత వాళ్ల బావ బి.గోపాలరావు దగ్గర అసిస్టెంట్‌ ఎడిటర్‌ చేరి నెల రోజుల్లో ఆ పని వదిలేశారు.

ఆతర్వాత ఆయన చిన్న బావ, ఎస్వీ రంగారావుకి పర్సనల్‌ మేకప్‌మెన అయిన నాయుడు తన పలుకుబడిని ఉపయోగించి వీనస్‌ స్టూడియోలో మేకప్‌ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా జయకృష్ణ ను జాయిన్ చేశారు. అంతే దాంతో ఆయన దశ తిరిగింది. కృష్ణంరాజు, జయసుధ, శోభనబాబు వంటి అగ్ర నటీనటులకు మేకప్‌మెన్గా పనిచేసి పైపైకి ఎదిగిన జయకృష్ణ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో పెద్దపెద్దవారితో పరిచయాలు పెంచుకుని నిర్మాతగా మారారు. ‘మనవూరి పాండవులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘నీకు నాకు పెళ్లంట’, సీతారాములు, ‘కృష్ణార్జునులు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. పలు చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహించారు. చిరంజీవి, సురేఖలకు పెళ్లి దగ్గరుండి చేసిన ఘనత జయకృష్ణకే దక్కుతుంది. కోడి రామకృష్ణకు, పద్మాంజలికి, కూడా పెళ్లి జరిపించారు. అయితే జయకృష్ణ ఎంత ఎత్తుకి ఎదిగినా మధ్యలో ఇబ్బందులు పడకతప్పలేదు. జయకృష్ణ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

English summary

Veteran Producer of Tollywood Jaya Krishna Passes Away at the Age Of 75 Years.Jaya Krishna produced the films like Sita Ramulu,Manavuri Pandavulu,Krishnaarjunulu,Neeku Naaku Pellanta ,etc movies. Jaya Krishna made Chiranjeevi and Surekha Marriage.