తేజస్వీని పచ్చిగా తిట్టిన నిర్మాత!

Producer scolds Tejaswi Madivada

06:43 PM ON 9th July, 2016 By Mirchi Vilas

Producer scolds Tejaswi Madivada

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో నటిగా పరిచయమైన తేజస్వి మడివాడ మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడుకి పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. దీని తరువాత రామ్ గోపాల్ వర్మ తెరక్కెకించిన 'ఐస్ క్రీమ్' చిత్రంలో హీరోయిన్ గా నటించి అందాలు విపరీతంగా ఆరబోసింది. అయితే ఆ చిత్రం ఆశించినంతగా ఆడలేదు. దీని తరువాత ఈ అమ్మడు తాజాగా 'రోజులు మారాయి' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇది కూడా అట్టర్ ప్లాప్ టాక్ ని మూట గట్టుకుంది. దీంతో ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస్ ను టార్గెట్ చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

రోజులు మారాయి సినిమా ప్రమోషన్స్ నిర్మాత సరిగా చేయలేదు.. అందుకే సినిమా ప్లాప్ అయ్యింది అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో నిర్మాతను ఓ రేంజ్ లో ఆడిపోసుకుంది. దీంతో ఆ నిర్మాతకు కూడా చిర్రెత్తుకు రావడంతో మనోడు కూడా పబ్లిక్ గానే అమ్మడిని బండ బూతులు తిట్టాడు. తేజస్వి జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ.. బిల్డప్ ఎక్కువ.. పుచ్చిపోయిన మొహం.. అంటూ నానా విధంగా తిట్టి పాడేసాడు నిర్మాత శ్రీనివాస్. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్ ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు జనాలు.

English summary

Producer scolds Tejaswi Madivada