ఈయన్ని కృష్ణుడు గా వద్దన్నారు

Producers Of Mayabazar Rejected Ntr Krishna Role

10:59 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Producers Of Mayabazar Rejected Ntr Krishna Role

అవును ఇది నిజమట. అసలు రాముడు, కృష్ణుడు ఎలా వుంటారో తన పాత్రల ద్వారా నిరూపించి, ఎన్నో పౌరాణిక పాత్రలతో అలరించిన ఎన్ టి ఆర్ తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి ఎన్ టి ఆర్ అనేక చిత్రాల్లో ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించినప్పటికీ, వెండితెరపై కృష్ణుడిగా ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చిందట. అదేమిటో చూద్దాం.

1/7 Pages

సొంతూరు దెబ్బతీసింది...

మొట్టమొదట ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన చిత్రం ‘సొంత ఊరు’. ఈ మూవీ 1956లో వచ్చింది. ఈ చిత్రం పరాజయం పాలైంది. ఈ చిత్రం తరువాత.. విజయా వారి బ్యానర్ లో వచ్చిన మాయబజార్ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర పోషించారు. అయితే, ఈ పాత్ర పోషించడానికి ఆయనకు చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి. ఈ సినిమా దర్శకుడైన కేవీ రెడ్డీ ఈ పాత్రకు ఎన్టీఆర్ నే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. విజయా బ్యానర్ కు చెందిన ప్రముఖుల సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ‘సొంత ఊరు’ పరాజయం పాలైందని, ఈ సినిమా కూడా పరాజయం పాలవుతుందని, అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా వద్దని పట్టుబట్టారట.

English summary

N. T. Rama Rao was an Indian film actor, writer, director, producer, and politician who also served as the Chief Minister of Andhra Pradesh for three terms. Once upon a time Producers Of Mayabazar Rejected Ntr Krishna Role.