పవన్‌, జగన్‌ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్‌ నిర్మాత

Produver PVP sensational comments on Jagan and Pawan Kalyan

03:50 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Produver PVP sensational comments on Jagan and Pawan Kalyan

బలుపు, సైజ్‌ జీరో, క్షణం, ఊపిరి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న పీవీపీ సంస్థ తాజాగా మహేష్‌ బాబుతో 'బ్రహ్మూెత్సవం' చిత్రాన్ని నిర్మించారు. అయితే పీవీపీ అధినేత పొట్లూరి వరప్రసాద్‌ తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మరియు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ఔఅధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టడానికి పీవీపీనే కారణమనే వాదనలు వినిపించాయి. ఈ నేపధ్యంలో పీవీపీ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మేమంతా ఓ రాజకీయేతర సంస్థను నడపాలనుకున్నామని, అయితే ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌ దానిని రాజకీయ సంస్థగా మార్చారని పీవీపీ చెప్పారని అంటున్నారు.

మేము పవన్‌ కళ్యాణ్‌ అనుకున్నది ఒకటని, ఆయన చేసింది ఒకటని అన్నారని చెప్తున్నారు. ఇంక ఈ సందర్భంగా తాను, మరికొందరం మౌనం వహించి పక్కకు తప్పుకున్నామని పీవీపీ అన్నారని చెప్తున్నారు. అంతే కాదు తాను గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ద్వారా టిక్కెట్‌ కోసం ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. అసలు ఎన్నికల సమయంలో నేను ఇండియాలోనే లేనని చెప్పారు. ఇదే సందర్భంగా వై.ఎస్‌. జగన్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో తనకి మంచి స్నేహం ఉందని, అయితే జగన్‌తో ఓ మాటలో తేడా రావడంతో మౌనంగా పక్కకు తప్పుకున్నానని చెప్తున్నారు.

అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీసే ఆలోచన తనకి లేదని స్పష్టం చేశారు. అంతేకాదు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వల్ల నేనేమైనా రూపాయి సంపాదించినట్లు ఋజువైతే దేనికైనా సిద్ధమే అన్నారు.

English summary

Produver PVP sensational comments on Jagan and Pawan Kalyan. Producer PVP shocking comments on Pawan Kalyan and Jagan Mohan Reddy.