మిడిల్ క్లాస్ అమ్మాయిలకు డబ్బు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతున్నారు..

Prostitution gang arrest in Bhimavaram

11:40 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Prostitution gang arrest in Bhimavaram

అమ్మాయిలను ఆకర్షించి, వ్యభిచార కూపంలోకి దింపే దారుణాలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యతరగతి అమ్మాయిలనే లక్ష్యంగా పెట్టుకొని, కేర్ టేకర్ల ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను విదేశాలకు తరలించి అక్కడి వేశ్యా గృహాలకు అమ్మేస్తున్న ముఠాలోని మరో మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవేడులో ముఠాలోని తూర్పుగోదావరి జిల్లా తాటికాయలవారి పాలేనికి చెందిన ఎస్.నాగసోమేశ్వరరావు అలియాస్ బాబు(33)ను అదుపులోకి తీసుకున్నారు. మధ్యతరగతి అమ్మాయిలకు డబ్బు ఎరవేసి, విదేశాల్లోని బ్రోతల్ హౌస్ లకు వారిని ముఠా సభ్యులు విక్రయిస్తున్నారని సీఐ చెప్పారు.

విమానాశ్రయంలోని కిందిస్థాయి ఉద్యోగులను లోబరుచుకుని, తమకు ఆటంకాలు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని.. టూరిజం వీసాతో అమ్మాయిలను విదేశాలకు తరలిస్తున్నారని వెల్లడిస్తున్నారు. అయితే, కాలపరిమితి పూర్తయిన తర్వాత బాధిత యువతులు స్వదేశం రాలేక అక్కడే ఉంటూ వేశ్యాగృహాల్లో మగ్గిపోతున్నారని.. ఇప్పటిదాకా ఈ కేసులో తమిళనాడుకు చెందిన పాండ్యరాజన్, రఫీ, ఫాతిమా, ఏసుప్రేమ అలియాస్ భీమవరం ఆంటీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్త్తున్నారు.

ఇది కూడా చూడండి: మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

ఇది కూడా చూడండి: ఈ ఆహార పదార్ధాలు కలిపి తింటే మీ ప్రాణాలకే ప్రమాదం!

ఇది కూడా చూడండి:చెట్టుకు స్థలం రాసి ఇచ్చేసాడు .. అక్కడ ఎం చేసారంటే ?

English summary

Prostitution gang arrest in Bhimavaram. 5 aunties arrested in Bhimavaram while doing prostitution. They are showing money to middle class family girls and sending them to another countries as prostitutes.