ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ లతో 7 రోజుల్లోనే హెయిర్ ఫాల్ ని అరికట్టవచ్చు!

Protein hair masks that will reduce hair fall in one week

03:58 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Protein hair masks that will reduce hair fall in one week

ఆడవారికైనా, మగవారికైనా జుట్టే అందం. ముఖం ఎంత అందంగా వున్నా జుట్టు లేకపోతే చూడలేం. చాలా మందిని జుట్టు రాలే సమస్య ఇబ్బంది పెడుతుంది. తరచూ మీ జుట్టు డ్రైగా మారడం, డ్యామేజ్ అవుతుండడంతో మానసికంగా చాలా కుమిలిపోతారు. ఇంకా మీరు రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూలు మరియు కండీషనర్స్ ఏమాత్రం పని చెయ్యకపోయినా తెగ హైరానా పడిపోతుంటారు. అయితే మీ జుట్టుకు ఖచ్చితంగా ప్రోటీన్ సప్లిమెంట్ అవసరం అవుతుంది. శరీరంలో ప్రోటీన్స్ నష్టపోతే ఆరోగ్యపరంగా ఎన్ని అనర్థాలు జరుగుతాయో. జుట్టులో కూడా సరైన పోషణ అందకపోయినా, ప్రోటీన్స్ లోపించిన జుట్టు అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఉంటుంది.

అందువల్ల, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా పెరగాలన్నా సరిపడా ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే కొన్ని ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు వేసుకోవడానికి ముందు, ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ల యొక్క ప్రత్యేకతను తెలుసుకోవాలి. ప్రోటీన్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు అందుతాయి. ప్రోటీన్ బేస్డ్ హెయిర్ ప్యాక్ ను బయట బ్యూటీ స్టోర్స్ లో కొనుక్కోవచ్చు. దానికి ముందు ఇంట్లో మనకు అందుబాటులో ఉండే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఎందుకు ట్రై చేయ్యకూడదు? ఇంట్లో ఉండే ప్రోటీన్ ఫుడ్స్ తో హెయిర్ ఫ్యాక్ వేసుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సులభం కూడా. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు రాలడానికి కారణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటుంది.

కొంత మందిలో జుట్టు రాలడానికి చుండ్రు కారణమైతే.. మరికొంత మందిలో డ్రై హెయిర్ వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. జుట్టు చిట్లకుండా... బ్రేకేజ్ కాకుండా ఉండాలన్నా.. జుట్టు రాలడం తగ్గించాలన్నా 7 ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు ఉన్నాయి. ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ లను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా...

1/8 Pages

1. అరటి హెయిర్ మాస్క్: (Banana Hair Mask)


ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. దీన్ని పురాతన కాలం నుండే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. బాగా పండిన లేదా మగ్గిన అరటిపండును గుజ్జులా, లేదా పేస్ట్ లా తయారు చేయాలి. మీ జుట్టు మరీ డ్రైగా ఉంటే అరటిపండుకు కొద్దిగా తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. 

English summary

If your hair is getting dry and damaged and your regular shampoo and conditioner are not helping at all, you need to supply protein elements to your scalp and hair. Like your body, your scalp and hair also need protein nourishment. Therefore, you need to go best protein hair masks that will reduce hair fall in a matter of days.